Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వారంలో రూ. 4.5 లక్షల సంపాదన.. ఇది రాత్రికి రాత్రే వచ్చిన విజయం కాదు.. మేకప్ ఆర్టిస్ట్ సక్సెస్ స్టోరీ!

Momina earns 45 lakhs in a week makeup artist success story
Advertisement
  • వారంలో రూ.4.5 లక్షలు సంపాదించిన ఢిల్లీకి చెందిన ఓ మేకప్ ఆర్టిస్ట్ 
  • కేవలం ఐదు బ్రైడల్, ఫ్యామిలీ బుకింగ్స్ ద్వారా ఈ ఆదాయం 
  • అత్యధికంగా ఒకే ఫ్యామిలీ నుంచి రూ. 2.2 లక్షలు అందుకున్నట్టు వెల్లడి
  • ఇది ఏళ్ల తరబడి కష్టపడితే వచ్చిన ఫలితమని స్పష్టీక‌ర‌ణ‌
Advertisement
ప్రస్తుతం యువతకు ఎన్నో కొత్త కెరీర్ అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. వాటిలో మేకప్ ఆర్టిస్ట్ కూడా ఒకటి. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్‌లో బ్రైడల్ మేకప్ ఆర్టిస్టులకు ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. 

తాజాగా ఢిల్లీకి చెందిన ఓ మేకప్ ఆర్టిస్ట్, కేవలం ఏడు రోజుల్లో సుమారు రూ. 4.5 లక్షలు సంపాదించినట్టు సోషల్ మీడియాలో పంచుకున్న వివరాలు వైరల్ అవుతున్నాయి. ఈ ఆదాయం వెనుక తన ఏళ్ల కష్టం ఉందని ఆమె చెప్పిన మాటలు ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్నాయి.

ఢిల్లీకి చెందిన మోమినా అనే యువతి, లగ్జరీ బ్రైడల్ మేకప్ రంగంలో ఐదేళ్లుగా పనిచేస్తున్నారు. 'సాఫ్ట్ గ్లామ్ స్పెషలిస్ట్'గా పేరు పొందిన ఆమె, ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియో పోస్ట్ చేశారు. అందులో కేవలం ఒక వారంలో ఐదు బ్రైడల్, ఫ్యామిలీ బుకింగ్స్ ద్వారా తాను రూ. 4.5 లక్షలు ఎలా సంపాదించిందీ వివరించారు.

ఆమె చెప్పిన వివరాల ప్రకారం.. ఆ వారంలో సింగపూర్‌కు చెందిన ఒక క్లయింట్‌కు మూడు విభిన్న లుక్స్‌ కోసం రూ. 63,000 సంపాదించారు. ఆ తర్వాత గతంలో తన క్లయింట్ అయిన మరొకరి వద్ద రూ. 73,000 అందుకున్నారు. అనంతరం ఒక బ్రైడల్ అసైన్‌మెంట్ కోసం కసౌలీకి ప్రయాణించి రూ. 55,000 ఆర్జించారు. 

అన్నింటికంటే పెద్ద బుకింగ్ ఢిల్లీలోనే లభించింది. ఒక పెళ్లికూతురు, ఆమె కుటుంబ సభ్యులకు వివిధ లుక్స్‌లో మేకప్ వేసినందుకు గాను ఏకంగా రూ. 2.2 లక్షలు సంపాదించారు. ఆ వారం చివర్లో మరో బ్రైడల్ బుకింగ్‌తో రూ. 37,500 అందుకున్నారు.

ఇది రాత్రికి రాత్రే వచ్చిన సక్సెస్ కాదు..  
అయితే, ఈ భారీ ఆదాయం రాత్రికి రాత్రే రాలేదని మోమినా తన పోస్ట్‌లో స్పష్టం చేశారు. "ఈ స్థాయికి చేరుకోవడానికి ఏళ్ల తరబడి కష్టపడ్డాను. కెరీర్ ప్రారంభంలో పోర్ట్‌ఫోలియో నిర్మించుకోవడం కోసం ఎలాంటి డబ్బులు తీసుకోకుండా ఎన్నోసార్లు పనిచేశాను. నిరంతర శ్రమ, క్లయింట్ల నమ్మకాన్ని గెలుచుకోవడం వల్లే ఇది సాధ్యమైంది" అని ఆమె పేర్కొన్నారు. ఆమె సక్సెస్ స్టోరీ, పట్టుదలతో పనిచేస్తే ఏ రంగంలోనైనా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని నిరూపిస్తోంది.
Advertisement
Advertisement
Momina
Delhi makeup artist
Bridal makeup artist earnings
Makeup artist success story
Luxury bridal makeup artist
Momina makeup artist income

More Telugu News